హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ వైసీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొద్దికాలంగా తనకు ప్రాధాన్యం లేదంటూ వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన క్రియాశీల రాజకీయాల్లోనూ సైలెంట్ గానే ఉన్నారు.
జగన్ వైఖరి..తెలంగాణ వైసీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం.. జగన్ పట్టించుకోకపోవడం.. తెలంగాణలో వైసీపీ బలం రోజురోజుకు తగ్గిపోతుండడంతో ఇక వైసీపీలో కొనసాగడం వద్దనుకుని రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. కాగా ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.