రాశి ఫలాలు

మేష రాశి

11'th feb - 17'th feb
మేష రాశి వారికి ఈ వారంలో నివాస స్థలము మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేస్తారు. బాకీలు వసులవ్వడం ఆలస్యం అవుతాయి. వైద్య వృత్తిలో ఉన్నవారు ఆకస్మిక విదేశీయాన పర్యటన చేయవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు కొంత కుదుటపడతాయి. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీరు చెయ్యని తప్పుకు చివాట్లు పడవలసి వస్తుంది. Plastic & Rubber వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు సహాయం చేసే గుణంతో ప్రజల మనసులను ఆకట్టుకుంటారు. వ్యసనాల జోలికి పోకూడదు. అప్పు కొంతమేర తీర్చగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి

11'th feb - 17'th feb
వృషభ రాశి వారికి ఈ వారంలో వ్యసనాల బారిన పడే అవకాశాలు కలవు. పిల్లల విషయంలో మానసిక వత్తిడిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. తండ్రికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. Eye sight పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు. తల్లిగారి శరీరానికి గాయాలు అయ్యే అవకాశం కలదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడకూడదు. పోలీసు శాఖ ఉద్యోగస్తులకు స్థాన చలనము కలిగే అవకాశాలు కలవు. నూతన ఆదాయ మార్గాన్ని అన్వేషించాలి. Milk Products వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మిధున రాశి

11'th feb - 17'th feb
మిధున రాశి వారికి ఈ వారంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి సభ గౌరవం లభిస్తుంది. గృహపరమైన చికాకులు ఉండును. Software ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉంటుంది. శత్రువులను కూడా మంచి మనసుతో క్షమిస్తారు. జీవిత భాగస్వామితో విదేశీ పర్యటన చేస్తారు. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. మంచి నిద్ర ఉండదు. Hair fall ఒక సమస్యగా మారుతుంది. శరీరము తొందరగా అలసిపోతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ధైర్యం సరిపోదు. Jewellery వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఏ నిర్ణయినా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు సానుకూలము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కర్కాటక రాశి

11'th feb - 17'th feb
కర్కాటక రాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలు చేస్తారు. సంతాన ప్రయత్నాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉండును. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. జీవిత భాగస్వామికి వృత్తి పరమైన అభివృధి ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టం కలిగే అవకాశాలు కలవు. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంగారం కొనుగోలు చేస్తారు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండను. చర్మవ్యాధితో ఇబ్బంది పడతారు. ధనపరమైన ఇబ్బందులు ఉండును. తండ్రి చేసే వ్యాపారాలు చేసే వారికి యోగ కాలము. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహ రాశి

11'th feb - 17'th feb
సింహ రాశి వారికి ఈ వారంలో స్థిరాస్తులకు సంబంధించిన తగాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తల్లితో చర్చించి తీసుకుంటారు. సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దాంపత్య పరమైన సౌఖ్యము ఉంటుంది. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబానికి దూరంగా విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. నూతన ఆదాయ మార్గాలకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. రవాణా శాఖ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండను. Paints & Hardware వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య రాశి

11'th feb - 17'th feb
కన్యా రాశి వారికి ఈ వారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సోదరులతో సఖ్యత బలపడుతుంది. కుటుంబముతో సరదాగా కాలాన్ని గడుపుతారు. జ్యేష్ట సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. Chemicals & Oil వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. వేడి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అకారణ కలహం అంత మంచిది కాదు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. కళా రంగంలో ఉన్నవారు నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చండి అమ్మ వారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

తులా రాశి

11'th feb - 17'th feb
తుల రాశి వారికి ఈ వారంలో వృధా సంచారము చేస్తారు. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే అవకాశాలు కలవు. స్థిరాస్తులకు సంబంధించి సోదరులతో చర్చలు కొలిక్కి వస్తాయి. నూతన వాహన ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. దాంపత్య పరమైన సౌఖ్యము ఉంటుంది. విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. శరీరానికి గాయాలు అయ్యే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండును. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. Hotel & Fast Food వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. Banking Sector లో ఉన్న వారికి పదోన్నతులు ఉండును. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చిక రాశి

11'th feb - 17'th feb
వృశ్చిక రాశి వారికి ఈ వారంలో దైవ స్మరణలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. Obesityతో ఇబ్బంది పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు. సోదరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు పట్టుదలతో అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. నూతన గృహ నిర్మాణానికి అడుగులు పడతాయి. సంతాన భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. Paper & Printing Press వ్యాపారస్తులకు అధిక లాభలు ఉండును. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి

11'th feb - 17'th feb
ధనస్సు రాశి వారికి ఈ వారంలో చేసే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం ఉంటుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిఠాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నను. బంగారం కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైన కలహాలకు దూరంగా ఉండాలి. Health Insurance ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది. మీ కింద పని చేసేవారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కలదు. స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాలుపంచుకుంటారు. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వాహనం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. లలితా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి

11'th feb - 17'th feb
మకర రాశి వారికి ఈ వారంలో విదేశీయాన ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. తండ్రికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వారం ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ గోచరిస్తుంది. ఆభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉంటుంది. నూతన వధూవరులు కలహాలకు దూరంగా ఉండాలి. శరీరంలో వేడి పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. కుటుంబ పరమైన కలహలకు తావివ్వకూడదు. ఆర్థిక పరమైన ఎదుగుదల ఉంటుంది. Rice mill వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. వీరభద్ర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కుంభ రాశి

11'th feb - 17'th feb
కుంభరాశి వారికి ఈ వారంలో పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో తల్లి తరుపు శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. వ్యసనాల జోలికి పోకూడదు. ప్రయాణ సమయంలో శరీరపరమైన అసౌకర్యం ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. ధనపరమైన ఎదుగుదల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. Textile వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి

11'th feb - 17'th feb
మీన రాశి వారికి ఈ వారంలో సేవా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార భాగస్వామితో legal issues ఏర్పడతాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు భోజనం చేస్తారు. సెంటిమెంట్ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. స్థిరాసుల వల్ల లాభం చేకూరుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. Cell Phone వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యసనాలకు ఆకర్షితులు అయ్యే అవకాశాలు కలవు. బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి. అప్పు కొంతమేర తీర్చగలుగుతారు. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. Administration ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
raasi

స్వర్ణకంకణధారి , జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

Mobile : 7730023250 , 8978510978

డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ