శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవి కాలం ముగియడంతో ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు . కరీంనగర్ సుడా చైర్మన్ పదవి దక్కించుకునేందుకు శాత భావన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరోసారి తనకు పదవి ప్రయత్నాలు చేస్తున్నారు .వీరితోపాటు సీనియర్ కాంగ్రెస్ నేత , ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ , మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు ఆసంపల్లి శ్రీనివాస్(వాసు) సుడా చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం . అలాగే ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు .
అయితే సుడా చైర్మన్ గా పనిచేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కి తిరిగి పదవి కట్టబెట్టద్దని కొత్తవారికి అవకాశం కల్పించాలని పలురు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు . మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ శ్రీధర్ బాబు అనుచురుడే కాకుండా , ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా సన్నిహితుడే . అందువల్ల కరీంనగర్ నివాసి అయిన ఆసంపల్లి శ్రీనివాస్ కు సుడా చైర్మన్ పదవి వస్తుందనే ధీమాతో అతని అనుచరులు ఉన్నారు . అసంపల్లి శ్రీనివాస్ కు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి .
గత పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపెల్లి కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికీ వివిధ సామాజిక సమీకరణల కారణంగా శ్రీనివాస్ కు టికెట్ దక్కలేదు .
సీనియర్ వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా , సైక్లింగ్ అసోసియేషన్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా , తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవాధ్యక్షులుగా ఆసంపల్లి శ్రీనివాస్ కొనసాగుతున్నారు . గత పార్లమెంటు , అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం ఆసంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా కృషి చేశారు . ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు .
అసంపల్లి శ్రీనివాస్ కు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. అందరి ఆశీస్సులతో తనకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కుతుందని ధీమాతో అసంపల్లి శ్రీనివాస్ ఉన్నారు .