సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫుల్ స్వింగ్ లో ఉన్న కమలనాథులు.. హస్తినలోనూ పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే ఛాన్సుంది. రీసెంట్ ఎలక్షన్స్ అన్నింటిలోనూ సత్తా చాటిన జోష్ తో.. ఢిల్లీపై కన్నేశారు. దీంతో అక్కడి ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు.. వరాలు కురిపిస్తున్నారు. 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 895 అనాథరైజ్డ్ కాలనీలను..రికగ్నైజ్ చేసేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే వీటిని క్రమబద్దీకరించి…తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ ఇతర అన్ని సదుపాయాలు కల్పించాలని డిసైడైంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా.. 25 నుంచి 27 సీట్లను గెలుచుకోవచ్చని స్కెచ్ వేస్తోంది.
గత ఎనిమిది నెలల్లో 8 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ… ఢిల్లీలోనూ పాగా వేసి కొత్త రికార్డు స్రుష్టించాలని ఆశపడుతోంది. మోడీ హవా, పెండింగ్ సమస్యల పరిష్కారం ద్వారా ఇది సాధ్యమేనని భావిస్తోంది. కాలనీలను గుర్తించడంతో పాటు.. ఢిల్లీ వాసులపై మరిన్ని వరాలను కురిపిస్తోంది. భవన నిర్మాణాల అనుమతులను మరింత సింప్లిఫై చేస్తున్నట్టు ప్రకటించారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.