పేద ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో మందికి ఊరటనిస్తోంది. ఈ క్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
నాగిరెడ్డిపేట మండలం మల్తుమేధ గ్రామానికి చెందిన దిగంబర్ శర్మ గారికి రూ.1.54 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అందజేశారు.
నాగిరెడ్డిపేట మండలం పెద్ద ఆత్మకూర్ గ్రామానికి చెందిన కవిత శ్రీనివాస్ గారికి రూ.1.54 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, *”పేద ప్రజలకు వైద్య చికిత్సల భారాన్ని తగ్గించి వారికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విస్తృతంగా సహాయం అందిస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకాన్ని చేరవేయడానికి నిరంతరం కృషి చేస్తాను”* అని తెలిపారు.
ప్రజల కష్టకాలంలో అండగా నిలుస్తూ సంక్షేమ పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇట్లు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
ఎల్లారెడ్డి నియోజకవర్గం