పొలిటికల్ ఫ్యాక్టరీ -ఖమ్మం
హైదరాబాదులో జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ సినీ నటుడు మోహన్ బాబుని, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయు ) ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం నగరంలో నల్లబ్యాడ్జీలను ,ప్లకార్డులను ధరించి నిరసన ర్యాలీ నిర్వహించి జిల్లా పోలీస్ కమీషనర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు మాట్లాడ్తూ రాష్ట్రంలో రోజు రోజుకు జర్నలిస్టులపై రక్షణ లేకుండా పోతుందని, సెలబెట్రిలు సైతం పాత్రికేయులపై దాడి చేయడం అంత్యంత శోచనీయమన్నారు. మోహన్ బాబు కుటుంబ తగాదాలపై ఒకరినొక్కరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న తరువాతనే మీడియా అతని నివాస ప్రాంతానికి చేరుకుందని,అయితే మీడియాను నియంత్రించే హక్కుగాని ,దాడి చేసే హక్కు గాని మోహన్ బాబుకు లేదన్నారు. విధినిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజికి వెళ్ళీన జర్నలిస్టులపై మోహన్ బాబు తన అనుచరులు,రౌడి లు,గుండాల,బౌన్స్ లర్లతో దాడి చేయించడాన్ని తమ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ ఘటనలో టివి9 రిపోర్టర్ రంజిత్ పాటు టివి5 వీడియో జర్నలిస్టు కూడా తీవ్రంగా గాయపడ్డారని ,ఇలాంటి దాడుల వల్ల జర్నలిస్టులను భయపెట్టాలని చూస్తే ..సహించేది లేదని పేర్కొన్నారు. సమాజ హితానికి పాటుపడుతున్న జర్నలిస్టులపై దాడికి పాల్పడడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. మీడియాతో మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించాల్సింది పోయి నోటి దురుసుతనంతో వ్యవహరించడం కాకుండా భౌతిక దాడులకు దిగడం క్షమించరానిదని అన్నారు ఇలాంటి దాడులు పున రావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీల్ జీవితంలో విలన్ పాత్రలు పోషించిన మోహన్ బాబు,నిజ జీవితంలోకూడా విలన్ మాదిరిగా వ్యవహరించడం తగదన్నారు. గతంలో కూడా ఇలాగే పలువురుని దూషించడం,దాడి చేయడం జరిగిందని, కనుక తక్షణమే మోహన్ బాబును, అతని అనుచరులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఎలక్ర్టానికి మీడియా అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ మాట్లాడుతూ వీధి రౌడీ లాగా ప్రవర్తించిన మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విచక్షణ కోల్పోయి వ్యవహరించిన మోహన్ బాబుపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా ఆయన పలువురుపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. స్ధంభాద్రి జర్నలిస్టు హౌజింగ్ సోసైటీ అధ్యక్షులు,ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కనకం సైదులు మాట్లాడ్తూ సినిమా నటుల చిత్రల ప్రచారానికి,ఫ్రి రీలిజ్ కి,ఆడియో రీలిజ్ కి మీడియా కావాలి కాని అదే మీడియాపై ఒక నటుడు దాడి చేస్తే చిత్ర పరిశ్రమల్లో ఎవ్వరూ కూడా ఖండించకపోవడం దారుణమన్నారు. మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలోటియుడబ్ల్యుజె (ఐజెయు)నగర శాఖ అధ్యక్షులు మైసాపాపారావు,కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ ,జిల్లా కోశాధికారి జనతా శివ,ఉపాధ్యక్షులు మైనోద్దిన్, జిల్లా నాయకులు జనార్దనా చారి. ఎలక్ర్టానిక్ మీడియా అసిసోయేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల భూపాల్ రావు,కార్యదర్శి అయ్యప్ప, మహేందర్,నగర నాయకులు ఏలూరు వేణుగోపాల్, కళ్యాణ్, ,మేడి రమేశ్, ఉపేందర్ రెడ్డి ,కొత్తూరు రమేశ్,బుర్రి శ్రీనివాస్,సాయి,శ్రీధర్ శర్మ ,ప్రెస్ క్లబ్ కోశాధికారి నామ పురుషోత్తం,వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అలస్యం అప్పారావు. జిల్లా నాయకులు ఎల్ సుధాకర్, ఎన్ సంపత్ కుమార్, గణేశ్, ప్రద్వి, వి వినయ్ కుమార్,ఫయాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల ఐక్యతవర్ధిల్లాలని,జర్నలిస్టులపై దాడిని ఖండించాలని,దాడికి పాల్పడ్డ మోహన్ బాబు పై చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా పోలీస్ కమీషనర్ సునీల్ దత్ కు విన్నతిపత్రాన్ని అందజేశారు.