మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత గడ్డం వెంకటస్వామి 95వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ కాక వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకట స్వామి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తదితరులు పాల్గొన్నారు.