మా విలేజ్ మూవీస్ బ్యానర్ పై సీనియర్ జర్నలిస్టు అయిలు రమేష్ దర్శకత్వంలో కె శ్రీనివాస్ యాదవ్ నిర్మించిన ఎలా ….. మర్డర్ – 2 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ ను గురువారం నాడు కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ రిలీజ్ చేశారు .
ఈ కార్యక్రమంలో దర్శకులు అయిలురమేష్ , నిర్మాత నటుడు శ్రీనివాస్ యాదవ్ , నటుడు శీలం శ్రీనివాసరావు , కనపర్తి శ్రీనివాస్ ,లోకిని కుమార్ తదితరులు పాల్గొన్నారు .
ఈ చిత్రంలో శ్రీనివాస్ యాదవ్ , సిరి చందన , సీతామాలక్ష్మి ,కీర్తి , శీలం శ్రీనివాస్ రావు , కలర్ సత్తన్న ,స్వరూప, కనపర్తి శ్రీనివాస్ , రాణి , తేజశ్రీ , అన్నపూర్ణ , లోకిని కుమార్ ,చిరంజీవ రెడ్డి , అశోక్ రావు , మర్రి రాజు యాదవ్ ,తిరుపతి , శాంతా కుమార్ , సుద్దాల రాజేష్ , సుమన్ తదితరులు నటించారు .ఈ చిత్రానికి కెమెరా , ఎడిటింగ్ : శివ బత్తుల ,మేకప్ : అశోక్ శ్రీరామోజు , రచన సహకారం : శివ తారక్ , అసిస్టెంట్ డైరెక్టర్స్ : సంపత్ గౌడ్ , కీర్తి, నిర్మాత : శ్రీనివాస్ యాదవ్ , కథ , మాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : అయిలు రమేష్