By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: తెలంగాణ పిసిసి పీఠంపై బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > తెలంగాణ పిసిసి పీఠంపై బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
NewsPolitical NewsTelangana

తెలంగాణ పిసిసి పీఠంపై బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

Last updated: 2024/09/10
Published September 10, 2024 News Political News Telangana
Share
SHARE
తెలంగాణ కాంగ్రెస్‌కు ఎవరు సారథ్యం వహించబోతున్నారనే విషయంపై గత కొంత కాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఒక బీసీ నేతను టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు . సుదీర్ఘ కసరత్తు అనంతరం పీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్‌ కుమార్ గౌడ్‌ పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ పదవి కోసం ఎంతో మంది ఆశావహులు పోటీ పడినా చివరికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయానికే అధినాయకత్వం మొగ్గు చూపినట్లుగా సమాచారం .
ఇప్పటివరకు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్న నిబంధనల ప్రకారం మూడేళ్లు పూర్తయిన అనంతరం పీసీసీగా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం . ఈ విషయాన్ని ఓపెన్‌గా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అంతే కాకుండా తనను పీసీసీ నుంచి తప్పించడం వల్ల ప్రభుత్వంపై దృష్టి సారించగలనని.. పీసీసీ వ్యవహారాలు మరొకరు చూస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ క్రమంలోనే కొత్తగా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై భారీ ఎత్తున కసరత్తు జరిగింది. ఈ క్రమంలో పీసీసీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పుడున్న సామాజిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని కొత్త వారికి అవకాశం కల్పించాలని కూడా చర్చించినట్లు తెలిసింది. గతంలో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ధర్మపురి శ్రీనివాస్‌ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రిగా అగ్ర కులాలకు సంబంధించిన వారు ఉంటే.. పీసీసీగా బీసీలు లేదా ఇతర వర్గాలకు సంబంధించిన వారికి అవకాశం కల్పించాలనేది సరైన నిర్ణయమని అధిష్ఠానం భావించినట్లు తెలిసింది. దానికి అనుగుణంగానే ఈ సారి బీసీలకు పీసీసీ ఇవ్వబోతున్నారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే క్రమంలో మహేష్‌ కుమార్‌ గౌడ్ వర్సెస్‌ మధుయాస్కి గౌడ్ అనే అంశంపై కూడా చర్చ పెద్ద ఎత్తున జరిగింది . ఫైనల్‌గా మహేష్‌కుమార్‌ గౌడ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ అధిష్ఠానం తన నిర్ణయాన్ని ప్రకటించింది .
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన సమయం నుంచి మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పూర్తి మద్దతుగా నిలిచారు. దీంతో తన లక్ష్యాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ వైపు మొగ్గు చూపినట్లు వినికిడి . మరో వైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధిష్ఠానం నిర్ణయించింది. అందులో భాగంగా రేవంత్‌కు సహకారం అందిస్తూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే ఎన్నికల్లో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉండాలని పార్టీ కసరత్తు చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు మహేష్ కుమార్‌ గౌడ్‌.. సీఎ రేవంత్‌తో కలిసి పార్టీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. నిన్నటి వరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో మహేష్ కుమార్ గౌడ్ సమర్థవంతంగా పనిచేశారు .ఇది ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది. తెలంగాణ పిసిసి పీఠంపై కూర్చునే అవకాశం దక్కింది .

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:BC Leader CongressBomma Mahesh Kumar GoudMahesh Kumar Goud TPCCpolitical factoryRevanth Reddy CMTelangana Congress LeadershipTelangana Congress NewsTelangana Election 2024Telangana PCC ChiefTelangana PoliticsTPCC President 2024
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article వాలీబాల్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులుగా అసంపల్లి శ్రీనివాస్
Next Article పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?