వాలీబాల్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఆసంపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు ఆసంపల్లి శ్రీనివాసును అభినందించారు. ఆదివారం నాడు కరీంనగర్ జ్యోతి నగర్ లో అసంపల్లి శ్రీనివాస్ వాలీబాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ,పోలీస్ శాఖలో ఆర్ ఐ గా పనిచేస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు కన్న రమేష్ ,కరీంనగర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్, పెద్దపెల్లి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు,
పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి దేవి వెంకటరమణ , కరీంనగర్ జిల్లా కార్యదర్శి అరిఫ్ తో పాటు దాదాపు 70 మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసంపల్లి శ్రీనివాసును పలురు సన్మానించారు.
పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి దేవి వెంకటరమణ , కరీంనగర్ జిల్లా కార్యదర్శి అరిఫ్ తో పాటు దాదాపు 70 మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసంపల్లి శ్రీనివాసును పలురు సన్మానించారు.