మిగిలిన 301 కోట్ల బకాయిలనూ వెంటనే చెల్లించాల్సిందే
వెంటనే కొత్త ఆర్డర్లు ఇచ్చి కార్మికులను ఆదుకోవాల్సిందే
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రతాప రామక్రిష్ణ, గోపి, ఆడెపు రవీందర్ డిమాండ్
సిరిసిల్ల నేత కార్మికుల బకాయిల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఈ మేరకు ఆయా నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.
బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయని, మిగిలిన బకాయిలను సైతం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కొత్త ఆర్డర్లను ఇచ్చి నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలని కోరారు. వీటితోపాటు పవర్ లూం కార్ఖానాలకు గత 30 సంవత్సరాల నుండి 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్ ను పునరుద్దరించాలని, కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి అధిగమించేలా అన్ని చర్యలు తీసుకోవాలని మనవి. వీటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో బీజేపీ పక్షాన మళ్లీ ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు.