కరీంనగర్ , పెద్ద పల్లి లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రజలు విభిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారా ? అంటే అవుననే చెప్పాలి . కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ను ఆ పార్టీ రంగంలోకి దించింది. టిఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమి చెందిన బోయిన్పల్లి వినోద్ కుమార్ ని తిరిగి రంగంలోకి దించింది . వీరిద్దరూ హోరాహోరీ ప్రచారం చేస్తుండగా , కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ టికెట్ కోసం వెలిచాల రాజేందర్ రావు , అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి
పోటీ పడుతుండగా , దాదాపుగా వెలిచాల రాజేందర్రావుకే కాంగ్రెస్ టిక్కెట్టు దాదాపు ఖరారు అయిందని ప్రచారం జోరుగా సాగుతోంది . గత లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపి మధ్య తీవ్రమైన పోటీ జరిగింది . ఆ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు . అయితే ఈసారి మాత్రం టిఆర్ఎస్ నామ మాత్రం పోటీ ఇస్తుందనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు బిజెపి అభ్యర్థి
బండి సంజయ్ కుమార్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది . అయితే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలో నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీ , బిజెపి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ లు పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం బిజెపి నామ మాత్రం పోటీ ఇస్తుంది .
ప్రధానంగా టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ , కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ సొంత పార్టీ నేతలే గడ్డం వంశీ అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకిస్తున్నారు . ఇది కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు . మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం వినోద్ , గడ్డం వివేక్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు .మళ్లీ అదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకి పెద్ద పల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ లో చాలాకాలంగా పనిచేస్తున్న నేతలు మండిపడుతున్నారు. ఇక్కడ మాదిగల కు టికెట్ ఇవ్వాలని ఉద్యమాలు కూడా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది ఇలా ఉండగా టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు సౌమ్యుడు , అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తిగా పేరు ఉండడంతో పెద్దపెల్లి ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు . రాష్ట్రంలో టిఆర్ఎస్ గెలిచిన గెలవకపోయినా పెద్ద పల్లి లో మాత్రం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విజయం సాధిస్తారని చర్చ కొనసాగుతోంది .
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లో విభిన్నమైన ఫలితాలు రానున్నట్లు పరిశీలకు అంచనా వేస్తున్నారు. పెద్దపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ , కరీంనగర్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .