(పొలిటికల్ ఫ్యాక్టరీ – నిజామాబాద్ )
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లొ ఈరోజు కురిసిన అకాల వర్షానికి పెద్ద పెద్ద వృక్షాలు కరెంటు స్తంభాలు నెలకొరిగాయి.
శుక్రవారం మధ్యాహ్నం నుండి ఏకధాటిగా కురిసిన వర్షాలకు గానూ రహదారు ల వెంట ప్రభుత్వ కార్యాల యాల వద్ద ఉన్న వృక్షాలు నేలమట్టం అయ్యాయి.
ప్రజలు సైతం ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గత కొన్ని రోజు లుగా ఎడతెరిపి లేకుండా ఎండలు 45 డిగ్రీల వరకు దంచి కొట్టడంతో ప్రజలకు అకాల వర్షం చల్లటి కబురు ఇచ్చింది.
రాబోవు రోజుల్లో వర్షం ముప్పు ఇంకా పొంచి ఉందని, వాతావరణ శాఖ హెచ్చరించడంతో మండలం లో ఎండ తగ్గుముఖం పట్టవచ్చని పలువురు అంటున్నారు.
రైతులు వరి కొనుగోలు కేంద్రాల వద్ద వేసిన ధాన్యం సైతం వర్షపు నీతిలో తడిసిపోయిందని, కొన్ని చోట్ల రేకులు ఊడిపోయా యి. మరికొన్ని చోట్ల చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో స్తంభాలు సైతం నేలకొరిగాయి.
మధ్యాహ్నం నుండి విద్యు త్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు.