హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం నాడు బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి . హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు . హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్, టీజీవోస్, ట్రెస్సా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల లో వివిధ ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ
బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన, శక్తివంతమైన పండుగ అన్నారు . మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పండుగ మాత్రమే అన్నారు , రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో జరుపుకునే మహోత్సవం బతుకమ్మ పండుగ . ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం అని జిల్లా కలెక్టర్ అన్నారు .
ప్రకృతి పరవశంలో ఉన్న సమయంలో గౌరీ దేవిని పూజించి జరుపుకునే బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం అన్నారు .