ఈ ఏడాది సంక్రాంతికి ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు కోలీవుడ్ నటుడు ధనుష్.ఈ సినిమా అనంతరం తన 50వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ‘రాయన్’ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్‌లో ధనుష్ మాంసం అమ్మేవాడి పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ కిషన్‌తో పాటు కాళిదాస్ జయరాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 2024లోనే విడుదల కానుంది. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.