నానితో ‘దసరా’ సినిమా చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆ సినిమాతో అందరికీ సుపరిచిత వ్యక్తి అయ్యారు. ఇప్పుడు అతని తమ్ముడు శశి ఓదెల చిత్ర పరిశ్రమలోకి ఆరంగేట్రం చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా కాకుండా నటుడిగా పరిచయం అవుతున్నాడు. అదే ‘దసరా’ సినిమాలో నానితో పాటు చేసిన దీక్షిత్ శెట్టి కి కూడా మంచి పేరొచ్చింది, నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ దీక్షిత్ శెట్టి, శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల కథానాయకులుగా ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి దర్శకుడు కె.కె, నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఈ సినిమా నేపధ్యం 90ల నాటి ఒక ప్రత్యేకమైన కథాంశంతో పీరియాడికల్ కైమ్ర్ డ్రామాగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్వాహకులు కొన్ని రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించి కాన్సెప్ట్ గ్లింప్స్‌తో ఈ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో మొదలెట్టారు. దీనికి ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రత్యేక అతిధిగా వచ్చి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఈ చిత్ర టైటిల్ ‘ఐఏఖి: కింగ్ జాకీ క్వీన్’ గా కూడా ప్రకటించారు. ఈ చిత్రంలో కింగ్‌గా దీక్షిత్ శెట్టి, జాకీగా శశి ఓదెల, క్వీన్‌గా యుక్తి తరేజా కనిపించబోతోన్నారు. అందుకే ఈ చిత్రానికి ‘ఐఏఖి కింగ్ జాకీ క్వీన్’ అనే టైటిల్‌ను పెట్టారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ టైటిల్ గ్లింప్స్‌తో సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేశారు. రెండు తుపాకులు, గులాబీలతో ఈ మూవీ టైటిల్‌ను ప్రజెంట్ చేయడంతో ఈ మూవీ కథ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం, నాగేష్ బానెల్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.