(పొలిటికల్ ఫ్యాక్టరీ – విశాఖపట్నం )
విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానం వేదికగా తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. శనివారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ… ఏపీలో జగన్, చంద్ర బాబు ఎవరు గెలిచినా మోడీ వైపే ఉంటారని విమర్శించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ కల్యాణ్ అని కొత్త అర్థం చెప్పారు. ఇప్పుడు ఏపీకి కావాల్సింది పాలకు లు కాదని… ఢిల్లీలో ప్రశ్నించే గొంతు అన్నారు. మనం తెలుగువాళ్లం.. మనమంతా అన్నదమ్ము లం…రాష్ట్రాలుగా విడిపో యినా తెలుగువారిగా కలిసి ఉందామన్నారు. ఏపీలో పదేళ్ళుగా ప్రశ్నించే గొంతుకలు లేవన్నారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇక్కడి వారి ద్వారా ఏపీని శాసిం చాలని అనుకుంటున్నారని ఆరోపించారు. జగన్, చంద్ర బాబు, ఏపీ ప్రయోజనాల కోసం ఈ పదేళ్లలో ఎప్పుడూ కొట్లాడలేదని విమర్శించారు. ఢిల్లీని అడిగి.. ప్రశ్నించి ఏపీకి లాభం చేసే నాయ కులు లేకుండా పోయార న్నారు. ఏపీలో మళ్లీ వారిద్దరిలో ఎవరు గెలిచినా మోడీ దగ్గరకే వెళతారని గుర్తించాలన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు మోడీని ఎదిరించి నిలిచే శక్తి ఉందా? అని ప్రశ్నించారు. కానీ షర్మిల మీకు అండగా నిలబడుతుందని… మీ కష్టాలలో తోడుగా ఉండాలని ఇక్కడకు వచ్చిందని చెప్పారు. అందుకే ఆమెను ఆశీర్వ దించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు, జగన్ ఢిల్లీలో మోడీని ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. అసలు ఏపీకి ఏమైనా తీసుకు వస్తారా? అన్నారు. అదే జరిగితే చంద్రబాబు అయిదేళ్లు, జగన్ మరో అయిదేళ్లు ఉంటే కనీసం పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? అని ప్రశ్నించారు.