సీఎం రేవంత్ సభలో అస్వస్థతకు గురైన కార్పొరేటర్ అభ్యర్థి సర్దార్ ధన్నాసింగ్‌కు తక్షణ వైద్య సాయం
నిలకడగా ఆరోగ్య పరిస్థితి..
కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు హాజరైన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ 58వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సర్దార్ ధన్నాసింగ్ గురువారం సాయంత్రం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.
ఈ విషయాన్ని వెంటనే గమనించిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, ధన్నాసింగ్‌ను తన స్వంత వాహనంలో చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బందితో దగ్గరుండి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం అంబులెన్స్ ఏర్పాటు చేసి కరీంనగర్లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడిన వెలిచాల రాజేందర్ రావు, ధన్నాసింగ్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన ధన్నాసింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వెలిచాల రాజేందర్ రావును పలువురు కాంగ్రెస్ నాయకులు, ధన్నాసింగ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వెలిచాల రాజేందర్ రావ్ తక్షణం స్పందించి మానవత దృక్పథం చాటుకోవడం విశేషం.