కరీంనగర్ కు రూ.1400 కోట్లు విడుదల చేశానని చెప్పడం పెద్ద జోక్
రెండేళ్ల పాలనలో కరీంనగర్ కు నయాపైసా ఇయ్యలే
నన్ను కోసినా నయాపైసా లేదని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికలొస్తున్నయని అబద్దాలాడుతున్నరు
దొంగ మాటలతో కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మి మోసపోకండి
సీఎంకు రోషం, పౌరుషం చచ్చిపోయిందని ఒప్పుకుంటారా?
కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా?
అందుకే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటారా?
మీకు చేతగాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం
మున్సిపల్ ఎన్నికలైపోగానే ఇంటి పన్నులు, నల్లా ఛార్జీలు పెంపు తథ్యం
పొరపాటున కాంగ్రెస్ ను గెలిపిస్తే…రోడ్డుపై నడిస్తే కూడా పన్ను వేస్తారు జాగ్రత్త
కమలం లక్ష్మీ అమ్మవారి పువ్వు.. స్వస్తిక్ శుభసూచికం…
బ్యాలెట్ లో పువ్వుపై స్వస్తిక్ గుర్తు గుద్దితే అన్నీ శుభ సూచకాలే
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కరీంనగర్ కు రూ.1400 కోట్లు ఇచ్చానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సీఎంకు నిజంగా దమ్ముంటే ఆ నిధులు ఎప్పుడు ఇచ్చారు? ఏయే అభివ్రుద్ధి పనులకు ఖర్చు చేశారు? అనే వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నన్ను కోసినా నయాపైసా లేదు’అని పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కేంద్రాన్ని నిందించడం విచిత్రంగా ఉందన్నారు. ‘‘రేవంత్ రెడ్డిగారు… మీలో రోశం, పౌరుషం చచ్చిపోయిందా? కేసీఆర్ పంపే మూటలతోనే ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా? అందుకే ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటే చెప్పండి… కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం. మా భుజం మీద తుపాకీ పెట్టి ఇతరులను కాలుద్దామంటే… ఆ ట్రాప్ లో ఇరుక్కోవడానికి మేం సిద్ధంగా లేం. సీఎంకు రోషం, పౌరుషం చచ్చిపోయిందని ఒప్పుకుంటారా?. కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా? అందుకే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటారా?. మీకు చేతగాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం’’అని అన్నారు.
కరీంనగర్, వరంగల్ పట్టణాలను జంట నగరాలుగా మార్చి డంపింగ్ యార్డ్ ను తరలిస్తానని సీఎం చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. డంపింగ్ యార్డు తరలింపు కోసం కేంద్రం నుండి రూ.50 కోట్లు మంజూరు చేయించడంతోపాటు చెత్త బయో మైనింగ్ కోసం మరో రూ.18 కోట్లు విడుదల చేసినా… ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే అడ్డుకుంటోందని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బొమ్మకల్ అంబేద్కర్ విగ్రహంవద్ద నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. 6, 34 డివిజన్ల అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయాళ కరీంనగర్ కు వచ్చారు. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేశారా? మహిళలకు రూ.2500లు, తులం బంగారం, స్కూటీ, అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలిచ్చారా? …
*కరీంనగర్ కార్పొరేషన్ అభివ్రుద్దికి రూ.1500 కోట్లు తెచ్చిన. ఏయే పనులు చేశానో వివరాలతోసహా బుక్ లెట్ ప్రింట్ చేయించి ఇంటింటికీ పంపుతున్నా. మొన్నటికి మొన్న నీళ్ల కోసం రూ.134 కోట్లు తెచ్చిన. ఇదిగాకుండా కార్పొరేషన్ కు మరో రూ.50 కోట్లు తెచ్చిన.
ఇయాళ కరీంనగర్ కు వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చి బండి సంజయ్ 7 రూపాయలైనా తెచ్చాడా? అని అడుగుతున్నడు… నేను చేసిన అభివ్రుద్ది, తెచ్చిన నిధుల వివరాలన్నీ బుక్ లెట్ రూపంలో మీ ఇంటికి పంపుతున్నా. సచివాలయానికి పంపుతున్నా. చదువుకోవాలి.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నయాపైసా ఇయ్యని రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రూ.1400 కోట్లు ఇచ్చినట్లు చెప్పడం విడ్డూరం. అంతేగాకుండా కరీంనగర్ ను వరంగల్ ను జంటనగరాలుగా మారుస్తానని, డంప్ యార్డ్ ను తరలిస్తానని చెప్పడం పెద్ద జోక్.
రేవంత్ రెడ్డికి దమ్ముంటే…. కరీంనగర్ కు రెండేళ్లలో ఎన్ని నిధులు ఇచ్చారు? ఏయే అభివ్రుద్ధి పనులు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి.
ఇయాళ రేవంత్ రెడ్డి వస్తే, ఎల్లుండి ఆయన అన్న అసదుద్దీన్ ఒవైసీ వస్తున్నడు. ఇద్దరూ మాట్లాడుకునే వస్తున్నరు. నేను అభివ్రుద్ధి పేరుతో ఎన్నికల్లోకి వస్తున్నా. వాళ్లు మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకుంటున్నరు. పొరపాటున మీరు కాంగ్రెస్ కు ఓట్లేస్తే అభివ్రుద్ధి ఆగిపోతుంది.
అవినీతి కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ రెడ్డి మమ్ముల్ని అడగడం ఆశ్చర్యంగా ఉంది. మా భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తామంటే ఆ ట్రాప్ లో పడటానికి మేం సిద్ధంగా లేం. అంత అమాయకులం కాదు. రేవంత్ రెడ్డికి రోశం, పౌరుషం చచ్చిపోయిందా? కేసీఆర్ పంపే మూటలతోనే ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా? అందుకే ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటే చెప్పండి… కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం. మా భుజం మీద తుపాకీ పెట్టి ఇతరులను కాలుద్దామంటే… ఆ ట్రాప్ లో ఇరుక్కోవడానికి మేం సిద్ధంగా లేం. సీఎంకు రోషం, పౌరుషం చచ్చిపోయిందని ఒప్పుకుంటారా?. కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా? అందుకే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటారా?. మీకు చేతగాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం.
కమలం లక్ష్మీ అమ్మవారి పువ్వు. ధన లక్ష్మీ. స్వస్తిక్ అంటే శుభ సూచకం. రేపు పోలింగ్ నాడు బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తు గుద్దితే అమ్మవారికి మీరు పువ్వు సమర్పించినట్లు. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. పొరపాటున కాంగ్రెస్ హస్తం గుర్తుపై గుద్దితే అదే చేయి మీ పాలిట భస్మాసుర హస్తమవుతుంది. షెడ్డుకు పోయిన కారుకు ఓటేసి దండుగ.