
* ఆకట్టుకున్న గిరి ప్రదక్షణ…
* భక్తులకు మహాఅన్న ప్రసాదం ఏర్పాటు..
* ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలన్న చైర్మన్ కొలిపాక వేణు..
( *పొలిటికల్ ఫ్యాక్టరీ – చిగురుమామిడి)
స్వయంభుగా వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ కొలిపాక వేణు కోరారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరను బుధవారం ఆలయ కమిటీ సభ్యులు కన్నుల పండుగగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి అర్చకులు వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.గ్రామానికి చెందిన బిల్లా ప్రభాకర్ రెడ్డి,బిల్లా జైపాల్ రెడ్డి,అయిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పట్టు వస్త్రాలను సమర్పించారు.ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి తప్పకుండా చేస్తామని,మన గ్రామంలో శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారు వెలసి ఉండటం చాలా అదృష్టమని బిల్లా జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు.భక్తుల సహకారంతోనే ఆలయ అభివృద్ధి సాధ్యమవుతుందని సహకరించాలని వేణు కోరారు.ఈ జాతరలో హుస్నాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ కంది తిరుపతి రెడ్డి,ఎంపీడీఓ విజయ్ కుమార్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ స్వరూప రాణి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతరకు విచ్చేసిన భక్తులకు మహా అన్నప్రసాదాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షణ కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో చాడ శ్రీధర్ రెడ్డి,పూదరి వేణుగోపాల్ గౌడ్,పెనుకుల తిరుపతి,బెజ్జంకి రాంబాబు,కౌటాం అంజయ్య,వెలిమల ఇంద్రసేన రావు,గ్రామపంచాయతీ కార్యదర్శి గోదారి అజయ్ మౌనిక,ఆలయ కమిటీ జనరల్ సెక్రెటరీ కాసాని సతీష్,కార్యదర్శి అరిగేలా రమేష్, ఉపసర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు మామిడి అంజయ్య,పరకాల కొండయ్య, పంకర్ల రాజు యాదవ్,బోయిని సంజు,చాడ అనిల్ రెడ్డి,బిల్లా తిరుపతిరెడ్డి,అన్న సదానందం, నెల్లి శంకర్,తంగనపల్లి అంజయ్య,గాజువాక రవీందర్, కారంపూడి వెంకటేశం,ఈశ్వర్ సమ్మయ్య,చెంచాల నాగరాజు, విలాసాగరం అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.