* 100శాతం ఉత్తీర్ణత సాధించాలన్న హెచ్ఎం లక్ష్మణరావు..
(పొలిటికల్ ఫ్యాక్టరీ/చిగురుమామిడి )
మండలంలోని బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ 5సంవత్సరాలు ఉపాధ్యాయులతో,తోటి విద్యార్థులతో అనుబంధం,తమ అనుభవాలను విద్యార్థులు పంచుకున్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులు నెల రోజులు మొబైల్ ,సోషల్ మీడియా వాడవద్దని ఇచ్చిన సమయంలో పరీక్షలు పూర్తిగా రాయడం ప్రాక్టీస్ చేసుకోవాలని పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని చెప్పారు.ఆరోగ్యంగా ఉండి పరీక్షలు మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకు,గురువులకు,ఊరికి మంచి పేరు తేవాలని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.పదో తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందిస్తూ,వారు భవిష్యత్తులో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సన్మానం చేస్తారు.విద్యార్థులు తమ అనుభవాలను, ఉపాధ్యాయుల కృషిని,స్నేహితులతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,గ్రామస్తులు, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.