ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి వెను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. మొత్తం 367 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగరపాలిక సంస్థకు 41, హౌసింగ్ శాఖకు సంబంధించి 37 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో
మహేశ్వర్, ఏవో సుధాకర్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.