జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
అధికారులకు ఆదేశం..
ప్రాజెక్టుల భూసేకరణ పై
అధికారులతో సమీక్ష..
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఎక్కడ జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ హుజురాబాద్ ఆర్డీవోలు, భూసేకరణ, ఇరిగేషన్ అధికారులతో జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇందిరమ్మ వరద కాలువ, మిడ్ మానేరు రిజర్వాయర్, మోతే ప్రాజెక్టు కెనాల్సు, గౌరవెల్లి రిజర్వాయర్ కెనాల్సు చొక్కా రావు ఎత్తిపోతల పథకం పనులు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అదనపు పనులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియపై పూర్తిస్థాయిలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పురోగతి భూ సేకరణ ఎంతవరకు పూర్తయింది.. అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ పనుల పురోగతి స్పీడ్ అప్ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని వాటి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా చేపట్టి ప్రాజెక్టుల పనులు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూసేకరణ విషయంలో జాప్యం ఎక్కడా జరగకుండా త్వరగా చర్యలు తీసుకొని ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన అదనపు పనులు కెనాల్సు నిర్మాణం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని ఆ దిశగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్ ప్రకాష్, కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్ హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు ఇరిగేషన్ శాఖ ఈఈలు రఫిక్, సంతు ప్రకాష్, డిఈ ప్రశాంత్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.