పరిషత్ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతాo..
రాష్ట్ర కమిటీ సమావేశంలో అంబటి జోజి రెడ్డి స్పష్టం.
కరీంనగర్:-
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తెలిపారు.సోమవారం కరీంనగర్ పట్టణ కేంద్రంలో మైత్రి హోటల్లో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం ఆర్ వి ప్రసాద్ అధ్యక్షత వహించగా వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబటి జోజి రెడ్డి మాట్లాడుతూ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని దానికి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ ఉదాహరణలు ఆయన అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఒక మున్సిపాలిటీ తో పాటు 33 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయకేతన్ ఎగరవేశారని అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయా అనిచితి ఉన్నదని దాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విధానాలతో తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఇచ్చినా స్ఫూర్తితో రానున్న పరిషత్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతామని ఆయన స్పష్టం చేశారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన పోరాటాలు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానాలు చేయడం జరిగిందని.రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికి వదిలేసి నర చేతుల వైకుంఠం చూపిస్తుందని, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ పార్టీలను బలోపేతం చేసుకునే పనిలో నిమధ్యమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సమ సమాజ స్థాపన దేయంగా రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలను పరిష్కారం దిశగా ముందుకు వెళ్లడానికి సంసిద్ధంగా పార్టీని తయారు చేస్తున్నమని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తేజ్ దిపరెడ్డి రాష్ట్ర నాయకులు, గొల్లపల్లి రాజుగౌడ్, రాములు యాదవ్, అంద బీరన్న, బత్తుల మధు ప్రకాష్, హకీమ్ నవిద్, సత్య రావు తదితరులు పాల్గొన్నారు