పెద్ద పల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీ టికెట్ల కేటాయింపు అనేది అన్ని పార్టీలకు అగ్నిపరీక్షగా తయారైంది! అందుకు కారణం అన్ని పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్లు కేటాయించాలని కోరుతూ నియోజకవర్గంలోని మాదిగల అందరూ ఏకమవుతున్నారు . పెద్దపెల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని మంచిర్యాల , చెన్నూరు , బెల్లంపల్లి , ధర్మపురి ,పెద్దపల్లి , రామగుండం, మంథని శాసనసభ నియోజకవర్గాల్లో మాదిగల ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి . ప్రతిసారి మాదిగల కి అన్యాయం జరుగుతుందని ఈసారి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని గెలిపించుకుంటామని మాదిగ ఐక్యవేదిక నాయకులు ప్రతిజ్ఞ చేస్తున్నారు . పెద్ద పల్లి ఎంపీ టిక్కెట్ మాదిగలకే టికెట్ కేటాయించాలని బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ,ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబులకు మాదిగ ఐక్యవేదిక నాయకులు ఇప్పటికే వినతి పత్రాలు సమర్పించారు. టిఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దాదాపు టికెట్ ఖరారు అయింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఎస్ కుమార్, కాసిపేట లింగయ్య , చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభలు బిజెపి టికెట్ ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపెల్లి ఎంపీ టికెట్ కోసం 29 మంది దరఖాస్తు చేసుకున్నారు .కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తే గెలవడం ఈజీ అనే చర్చ జరుగుతుండడంతో ఇక్కడ తీవ్ర పోటీ ఏర్పడింది. పెద్దపెల్లి ఎంపీ కాంగ్రెస్ టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే కుమారుడు గడ్డం వంశీ, ప్రముఖ బిల్డరు, రియల్టర్ ,సినీ నిర్మాత , మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ సుగుణ కుమారి, సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు టికెట్ ఆశిస్తున్నారు .
అయితే మాదిగల ఐక్యవేదిక పోరాటం షురూ కావడంతో టికెట్ కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆచితూచి అడుగు వేస్తున్నట్లు సమాచారం.
తన కుమారుడి వంశీకృష్ణ కే ఎంపీ టిక్కెట్టు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వివేక్ వెంకటస్వామికి, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి వినోద్ వెంకటస్వామికి ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇద్దరు కూడా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు అదే కుటుంబం కు చెందిన గడ్డం వంశీకి ఎంపీ టికెట్ కావాలని అడగడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు . గడ్డం వంశీకృష్ణ మాల సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం ఆయనకు మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు . ఇక సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కు టికెట్ ఇవ్వద్దని కాంగ్రెస్ కార్యకర్తలే నిరసన వ్యక్తం చేస్తున్నారు. జంపు జిలానిలను ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కార్యకర్తలు కోరుతున్నారు . ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ సుగుణ కుమారి లేదా మాదిగలకు ఎవరికి టికెట్ టికెట్ ఇచ్చిన గెలిపించుకుంటామని మాదిగ ఐక్యవేదిక నాయకులు చెబుతున్నారు. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో మూడు లక్షల పైగా మాదిగల ఓట్లు ఉన్నాయని మాదిగ అభ్యర్థికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీ లభిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఆసంపల్లి శ్రీనివాస్ లేదా సుగుణ కుమారి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే మాజీ ఎంపీ సుగుణ కుమారి స్థానికంగా ఉండకపోవడం, దుబాయ్ లో సెటిల్ కావడం ఆమెకు మైనస్ పాయింట్ గా మారింది. ఏది ఏమైనా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో పార్టీలకతీతంగా మాదిగలు అందరూ ఏకం కావడం ఇదే మొదటిసారి . మాదిగలను విస్మరిస్తే మట్టి కరిపిస్తామని రాజకీయ పార్టీలకు మాదిగ ఐక్యవేదిక సంకేతాలు పంపుతుంది. ఏ పార్టీ ఎవరికి టిక్కెట్లు కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే.