హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజ రాజ చోర’ చిత్రం నవ్వుల వర్షం కురిపించి.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. పీపుల్ విూడియా ఫ్యాక్టరీపై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించబోయే కొత్త చిత్రం కోసం వీరు మళ్లీ కలిశారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం 32గా పీపుల్ విూడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. తాజాగా ఓ పోస్టర్ వదిలారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ఫన్ జనరేట్ చేస్తోంది. ఈ సినిమా టైటిల్‌ని గురువారం శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నారు. దానికి నామకరణం ఈవెంట్ అని పేరు పెట్టారు. ఇది అచ్చతెలుగు సినిమా అని చెప్పడమే దీని ఉద్దేశం. పోస్టర్ సూచించినట్లుగా ఈ కొత్త చిత్రం బిగ్గర్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’తో ఆకట్టుకున్న హసిత్ గోలి.. శ్రీవిష్ణును హిలేరియస్ పాత్రలో ప్రజెంట్ చేయడానికి మరొక వినోదాత్మక, విన్నింగ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. మరోవైపు, శ్రీవిష్ణు తన గత చిత్రం ’సామజవరగమన’ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో టాప్ ఫామ్‌లో వున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రం.. మరోసారి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను గురువారం వెల్లడిరచనున్నారు.