కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్
వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచులు చిట్యాల సురేష్, కొప్పెర లింగారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాస్ రావు, కరండ్ల మధుకర్ లతో కలిసి కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయానికి విచ్చేసిన ఆయా నేతలు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలతోపాటు బండి సంజయ్ చేసిన పోరాటాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు తెలిపారు. బీజేపీలో చేరిన వారిలో రాజు, మధు, ఎడ్ల సురేష్, రవి, రాజేశ్, మల్యాల శ్రీను, జి.శ్రీనివాస్, రాజేష్, పూదరి చిన్నయ్య, పి.వెంకట్, పి.చెన్నులు, శంకర్, పి.రాజేశ్, పి.రమేశ్, నక్కల నారాయణరెడ్డి, జనార్దన్ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులున్నారు.