(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్)
జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని నూతనంగా నియామకమైన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామి ఇచ్చారు. కరీంనగర్ లో ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని… ఈ కారణంగానే జర్నలిస్టులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న హౌసింగ్ సొసైటీ సమస్యలు ….జర్నలిస్టుల హెల్త్ కార్డులకు సంబంధించిన అంశం పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.. ఇళ్ళ స్థలాల అంశం దశాబ్దకాలంగా పెండింగ్ పడుతూ వస్తోందన్నారు. హెల్త్ కార్డులు పని చేయడం లేదని.. పేద జర్నలిస్టులు ఆందోళన చెందుతున్న విషయమై గతంలో పలుమార్లు తాము యూనియన్ పరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముందడుగు వేస్తున్నారని అభినందించారు. మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలోనే కలుస్తానని అన్నారు. జర్నలిస్టు వృత్తిలో ఉన్న వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం …. అవసరమైన శిక్షణ కూడా అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందర్నీ కలుపుకొని మీడియా రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.