By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం..
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం..
NewsTelangana

తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం..

Last updated: 2026/03/09
Published March 9, 2026 News Telangana
Share
SHARE

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో నంబర్ వన్ గా నిలవాలి..

ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది..

గ్రామాల స్వరూపాన్ని మారుద్దాం..

ఇందిరమ్మ ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి..

ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగాలి..

ప్రభుత్వ పాఠశాలలను
బలోపేతం చేయాలి..

పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపని గ్రామాలకు ఎంత పెద్ద పనైనా చేసి పెడతా..

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి..

ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్
తయారు చేయండి..

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండలాల స్థాయి సమావేశాల్లో మంత్రి అధికారులకు ఆదేశాలు..

చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో సమావేశాలు..

ప్రగతి ప్రణాళికను సమిష్టి కృషితో సక్సెస్ చేస్తాం..

గ్రామాల్లో సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి..

కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

(పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్ )


ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి సైదాపూర్ మండలాలను నంబర్ వన్‌గా నిలపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో జరిగిన సన్నాహక సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో జిల్లా మండల స్థాయి అధికారులు ఆయా మండలాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని దీంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు మండల జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. వేవంతంగా పనులు పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామాల్లో పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపని గ్రామాల్లో ఎంత పెద్ద పనైనా చేసి పెడతానని హామీ ఇచ్చారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని పేర్కొన్నారు. గ్రామాల్లో విద్య వైద్యము ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తోపాటు తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలనీ ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.

చిగురుమామిడి లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ అధికారుల మందిరము సమిష్టిగా కృషి చేసి కరీంనగర్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు తాగునీటి సమస్య రాకుండా మిషన్ మోడ్ పనిచేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని నిధులు నిధుల వినియోగంపై పకడ్బందీ ప్రణాళిక అవగాహనతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రజల్ని కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి గ్రామాలను సమూలంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో పల్లెలను ప్రగతి పథంలో పయనించేలా చూస్తామన్నారు. ఆయా మండలాలకు సంబంధించి అధికారులు వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోస్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆర్డీవో కే మహేశ్వర్ డిపిఓ జగదీశ్వర్ డి ఆర్ డి ఓ శ్రీధర్ జిల్లా వైద్యాధికారి వెంకట రమణ సంక్షేమ అధికారి సరస్వతి హౌసింగ్ పిడి శ్రీనివాస్ స్పెషల్ ఆఫీసర్లు, వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article శాసన మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Next Article అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకం
- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?