By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకం
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకం
NewsPolitical NewsTelangana

అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకం

Last updated: 2026/03/12
Published March 12, 2026 News Political News Telangana
Share
SHARE

జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదాం
పరిపాలన విధానంపై అవగాహన పెంచుకోవాలి
99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలి

కార్పొరేటర్లు, కౌన్సిలర్ల శిక్షణలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

నగరం పట్టణాల అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకమని, అందరం కలిసికట్టుగా జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక” 99రోజుల కార్యాచరణలో భాగంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
శిక్షణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ శాఖలు ప్రజల కోసం అందించే సేవా కార్యక్రమాలు, పథకాల గురించి పి.పి.టి ద్వారా వివరించారు. మున్సిపల్ చట్టాలు, మున్సిపాలిటీలోని వివిధ విభాగాలు నిర్వహించే కార్యక్రమాలు, అధికారులు, సిబ్బంది విధులు, బాధ్యతలు గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ కార్పొరేటర్లు, వార్డు సభ్యులు ఎంత బాధ్యతగా ఉంటే ఆ పట్టణాలు అంతలా అభివృద్ధి చెందుతాయని అన్నారు. వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు, సమస్యల పరిష్కారానికి ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. నిత్యం శానిటేషన్ విధానం పర్యవేక్షించాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వార్డులను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల ఎదురుగానే పరిష్కారం కావాలని ఉద్దేశంతో మున్సిపాలిటీల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పెండింగ్ లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, దరఖాస్తుల పరిష్కారం చురుగ్గా సాగుతోందని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాలుపంచుకుంటూ అంతిమంగా ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పౌరుల సేవలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అవినీతి రహిత పాలనతో ఆదర్శంగా నిలవాలని సూచించారు. మున్సిపల్ చట్టాలపై అవగాహన పెంచుకొని ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. ప్రతి కార్పొరేటర్ డివిజన్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మున్సిపల్ చేపట్టే పనులను పర్యవేక్షించాలని కోరారు. వేసవి దృష్ట్యా తాగునీరు వృధా చేయకుండా అవగాహన కల్పించాలని, ఎక్కడైనా పైపు లైన్ మరమ్మతులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ “ప్రజా పాలన ప్రగతి ప్రాణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి కార్పొరేటర్ డివిజన్లో పర్యటించి సమస్యలను గుర్తించాలని తెలిపారు. ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని అధికారులతో చర్చించి పరిష్కారం అయ్యే విధంగా చూడాలని తెలిపారు. ప్రజాపాలనలో మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు పరిష్కారం పరిష్కరించడం మంచి విషయమని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రజలకు మరింత సేవ అందించాలని తెలిపారు.
డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్ లో 66 స్థానాలకు గాను 46 మంది కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారని తెలిపారు. ఇలాంటి శిక్షణ వారికి ఉపయోగకరమని అన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. నగరంలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మున్సిపల్ సమస్యలకు సంబంధించి ప్రజలు ఇచ్చిన అర్జీలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు మున్సిపల్ డాష్ బోర్డులో సమాచారం సూచించాలని అన్నారు. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు మున్సిపల్ చట్టాలు, వ్యవస్థ, విభాగాలు వాటి పనితీరుపై అవగాహన చాలా ముఖ్యమని అన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత చేరువై సేవ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన శిక్షణలో ప్రభుత్వ సేవలు, మున్సిపల్ చట్టాలు, కార్పొరేటర్ల విధులు, బాధ్యతలు గురించి స్పష్టంగా శిక్షణ ఇస్తున్నామని, నూతన కార్పొరేటర్లు కౌన్సిలర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, హుజురాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ మహమ్మద్, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్పర్సన్ పెరుమాండ్ల మానస, మున్సిపల్ కమిషనర్లు సయ్యద్ ముసాబ్ అహ్మద్, మనోహర్, మహమ్మద్ ఆయాజ్ పాల్గొన్నారు.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:#Corporators #Councilors #UrbanDevelopment #LocalGovernance #CityDevelopment #PublicService #CommunityDevelopment #MunicipalLeadership #LocalGovernment #CivicDevelopment
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం..
Next Article కొత్త కలెక్టరేట్ నుసుందరంగా తీర్చిదిద్దండి..
- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?