(పొలిటికల్ ఫ్యాక్టరీ హైదరాబాద్ )
చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ , మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర రావు , జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పొన్నం ప్రభాకర్ , వివేక్ వెంకటస్వామి , మహమ్మద్ అజహరుద్దీన్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మండలిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో రేవంత్ రెడ్డి పూజ నిర్వహించారు.