కన్న ఊరు లాగే కరీంనగర్ ను మర్చిపోలేను..
అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్ర అభివృద్ధికి శక్తియుక్తుల కృషి చేశా..
వీడ్కోలు సమావేశంలో పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి
జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఘన సన్మానం..
జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని
కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.
కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో తాసిల్దారులు ఎంపీడీవోలు అధికారులందరూ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావద్వేగ పూరితంగా ప్రసంగించారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పనిచేయడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు అధికారులు కిందిస్థాయి సిబ్బంది సహకారంతో తన శాయశక్తుల సమగ్ర అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. ఇందులో అందరి సహకారం ఎల్లవేళలా మరువలేనని పేర్కొన్నారు. కన్న ఊరు కోరాపూట్ తర్వాత జీవితంలో ఎప్పటికీ కరీంనగర్ జిల్లాను మరిచిపోలేని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కన్న తల్లి లాగా అక్కున చేర్చుకుందని తెలిపారు. జిల్లా ఎంతో నేర్పిందని చెప్పారు.
సిపి గౌష్ ఆలం తో పాటు జిల్లా అధికారులు అందరూ అభివృద్ధిలో తన వంతు సహకారం అందించారని వారి సహకారంతోనే జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని పేర్కొన్నారు
. ఈ కార్యక్రమంలో సిపి గౌష్ ఆలం అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే లక్ష్మికిరణ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ హుజురాబాద్ ఆర్టీవోలు కే మహేశ్వర్ రమేష్ బాబు అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో సంఘాల ప్రతినిధులు ఎంపీడీవోలు తహసీల్దారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..