జిల్లాలో కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం తనిఖీ చేశారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాల, భగత్ నగర్ లోని అల్ఫోర్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం, హాల్ టికెట్ల తనిఖీ, బందోబస్తు ఏర్పాట్లు తదితర విషయాలపై ఆరా తీశారు. మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా చూడాలని అధికారులను ఆదేశించారు