ప్రముఖ సినీ నిర్మాత , మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని గోదావరిఖనికి చెందిన పలువురు మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.
గోదావరిఖనిలోని ఆయాన్సు బంకిట హాల్లో శుక్రవారం జరిగిన ఆసంపల్లి ఆత్మీయ సమ్మేళనంలో పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజల మనిషి , ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి ఆసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో పెద్దపెల్లి ఎంపీగా గెలిపించుకుంటామని పలువురు ప్రతిజ్ఞ చేశారు . మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి , స్థానికుడు, సింగరేణి కార్మికుని ముద్దుబిడ్డ ఆసంపల్లి శ్రీనివాస్ ఎలాంటి పదవి లేకుండానే చాలామంది యువతకు ఉపాధి కల్పించారని, ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంత అభివృద్ధి తో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ఆసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆసంపల్లి శ్రీనివాసుని ఆత్మీయ సమ్మేళన నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులు దెబ్బేట ప్రేమ ,కొండ్ర రాజేశ్వరి, అరికెళ్ల సువర్ణ, యువ నాయకులు దెబ్బట సతీష్, ఎలకపల్లి వినోద్,గుమ్మడి బన్ను, బట్టు జలపతి, అరికెళ్ల సదానందం, అరికిల్ల నరేష్, ఎండి గుంశా వలి తో పాటు పలువురు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.