
(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్)
పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ గౌడ్ , రిపోర్టర్లు చారి , సుధీర్ల అరెస్టును హరీష్ రావు ఖండించారు .
మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు .
ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి.
తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని హరీష్ రావు విమర్శించారు .
జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు?
మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం అని హరీష్ రావు అన్నారు.
రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన?
ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ?
అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.