By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన అంతర్జాతీయ పతంగుల , మిఠాయిల పండుగ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన అంతర్జాతీయ పతంగుల , మిఠాయిల పండుగ
NewsTelangana

హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన అంతర్జాతీయ పతంగుల , మిఠాయిల పండుగ

Last updated: 2026/01/14
Published January 14, 2026 News Telangana
Share
SHARE

ప్రారంభించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఇలాంటి వేడుకలు ఎంతో అవసరం: మంత్రి జూపల్లి.
+పర్యాటక రంగం ద్వారా ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.*


(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )

నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ పతంగుల, మిఠాయిల పండుగ (International Kite and Sweet Festival) మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్ర కలిగిన పతంగుల పండుగ, మన సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ కోసం
ప్రభుత్వం ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ దేశాల, రాష్ట్రాల నుండి తరలివచ్చి ఎగురవేస్తున్న రంగురంగుల పతంగులు ఆకాశాన్ని మురిపిస్తున్నాయని పేర్కొన్నారు. తన చిన్నతనంలో పతంగులు ఎగురవేసిన మధుర జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

గాలిపటాల తయారీని హైదరాబాద్‌లోనే పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజలు తమ బిజీ జీవితంలో కనీసం నెలకు రెండు రోజులైనా పర్యాటక ప్రదేశాలను సందర్శించాలి. దీనివల్ల మానసిక ఉల్లాసంతో పాటు, స్థానిక కళాకారులకు, వ్యాపారులకు ఆర్థికంగా చేయూత లభిస్తుంది” అని మంత్రి పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌ను ప్రజలందరూ సందర్శించి విజయవంతం చేయాలని కోరుతూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల మిఠాయిల స్టాళ్లను మంత్రి జూపల్లి
సందర్శించి, రుచులను ఆస్వాదించారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎం.డి క్రాంతి వల్లూరి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహ రెడ్డి, హెరిటేజ్ డైరెక్టర్ అర్జున్ రావు, కైట్ ఫెస్టివల్ కన్సల్టెంట్ పవన్ డి సోలంకి, క్లిక్ (CLICK) ప్రతినిధులు లింబీ బెంజిమన్, పరమానంద శర్మ , అభిజిత్, తదితరులు పాల్గొన్నారు

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:#InternationalKiteFestival #KiteFestival #SankrantiCelebrations #SweetsFestival #HyderabadEvents #FestiveVibes #CulturalFestival
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article ప్రజలు మిమ్మల్నే అగ్నిగుండంలోకి నెట్టెస్తారు*ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు – బీఆర్ఎస్‌ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం
Next Article పండుగ వేళ, అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టులపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?