ఉదయం నుంచి రాత్రి వరకు..
క్షణం తీరిక లేకుండా..
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రచారం..
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి..
కరీంనగర్ ను అభివృద్ధి చేసే బాధ్యత మాది..
బీఆర్ఎస్ బిజెపి మోసపూరిత మాటలు నమ్మకండి..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆదివారం వివిధ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగారు. పకడ్బందీ ప్రణాళికతో ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పలు డివిజన్లలో జరిగిన కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఏ విధంగా కరీంనగర్ అభివృద్ధికి దోహదపడుతామో ఉదాహరణలతో సహా వివరించారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని రాజేందర్ రావ్ పేర్కొన్నారు. ఇతర పార్టీలతో సాధ్యం కాదని గల్లిగల్లిన సమస్యలు పరిష్కరించేది కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రజలకు స్పష్టం చేశారు. నీఆర్ఎస్ బిజెపి నేతలు కబ్జాకోరులు అనీ, దోపిడీదారులని వారికి తగిన బుద్ధి ఎన్నికల్లో చెప్పాలని రాజేందర్ పిలుపునిచ్చారు. మొదట 16 డివిజన్ మల్కాపూర్ లక్ష్మీపూర్లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. కార్పొరేటర్ అభ్యర్థి జగన్ రెడ్డి మనుషులను కొందరు పనికిమాలిన వాళ్లు బెదిరిస్తున్నారని ఆ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో రాజేందర్ రావు ప్రసంగించారు. 17, 18 డివిజన్లలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. 5, 59వ డివిజన్లలో రాజేందర్ రావ్ ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. 15 వ డివిజన్ చింతకుంటలో జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రాజేందర్ రావు పాల్గొన్నారు. 24 వ డివిజన్లో కార్నర్ మీటింగ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. వీటితోపాటు రాత్రి వరకు విస్తృతంగా పలు డివిజన్లలో రాజేందర్ రావు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ బిజెపి నేతల అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రత్యేకంగా చేస్తున్నారు రాజేందర్ రావు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది.