ఈ అంశాలే ప్రధానంగా ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి
అన్నీ తానై అభ్యర్థుల గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుని చెమటోడ్చిన బండి సంజయ్
అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకు మించి రాత్రింబవళ్లు కార్యకర్తలే గెలుపే లక్ష్యంగా పనిచేసిన కేంద్ర మంత్రి
శభాష్…. సంజయన్న….అంటూ వేనోళ్ల పొగుడుతున్న కార్యకర్తలు
బండి సంజయ్ కష్టపడుతున్న తీరును చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్న కరీంనగర్ ప్రజలు…
*ఈసారి మా ఓటు… బీజేపీకే అంటూ బహిరంగంగానే చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైనం… *
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల ప్రచార సరళి, ఎన్నికల ఎజెండా, అభ్యర్థుల గెలుపు కోసం వేసే ఎత్తుగడలు వంటి అంశాలను పరిశీలిస్తే….అన్నింట్లోనూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అగ్రభాగాన నిలిచారు. ఈ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తూ వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. మొదటిది అభివ్రుద్ధి నినాదం… రెండోది ఆధ్యాత్మికం కాగా మూడో అంశం ఆదర్శవంతమైన పాలన.
కరీంనగర్ కార్పొరేషన్ సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలన్నింటిలోనూ భారతీయ జనతా పార్టీ ప్రచారంలోనూ ముందంజలో ఉంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నీ తానై ప్రచారంతోపాటు అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకుని పనిచేశారు. ఒకవైపు ప్రచారం..మరోవైపు పార్టీ కార్యక్రమాలు…ఇంకోవైపు పోల్ మేనేజ్ మెంట్ సహా అన్నీ పనులు ఒంటి చేత్తో నిర్వర్తిస్తూ… ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పెద్దగా కష్టం లేకుండా చేయడంలోనూ బండి సంజయ్ అగ్రభాగాన నిలిచారు.
ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ ఈసారి విభిన్న రీతిలో ప్రచారం నిర్వహించారు. హిందుత్వ నినాదాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తారని ప్రత్యర్థ పార్టీలు భావించారు. అందుకు భిన్నంగా పూర్తిగా అభివ్రుద్ధి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా జిల్లాలోని మున్సిపాలిటీల అభివ్రుద్ధికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు… కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి తాను తెచ్చిన నిధులతో జరిగిన అభివ్రుద్ధి పనులను ప్రతి మీటింగ్ లోనూ వివరిస్తూ బండి సంజయ్ మాటలకే పరిమితం కాలేదు… చేతల్లో చూపుతున్న అభివ్రుద్ధి కాముకుడు అనే భావనను ప్రజలకు కలిగించడంలో సక్సెస్ అయ్యారు.
ఇకో రెండో విషయాన్ని బండి సంజయ్ లో స్వతహాగా దైవ భక్తి, అధ్యాత్మిక చింతన ఎక్కువ. ప్రజల్లో అధ్యాత్మిక చింతన పెంపొందించాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారంలో ప్రతి కాలనీ, డివిజన్ లో ఎక్కడ ఆలయాలు అభివ్రుద్ధికి నోచుకోలేదో…వాటిని అభివ్రుద్ధి చేస్తానని మాట ఇచ్చారు. అదే సమయంలో ప్రజలు ఎక్కడ ఆలయం కావాలని కోరితే… అక్కడ నూతన ఆలయాలను నిర్మిస్తానని కూడా హామీ ఇవ్వడం గమనార్హం. ఇక మూడో విషయానికొస్తే కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ తోపాటు ఆయా మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే….అవినీతి, కబ్జాదారుల అంతు చూస్తానని, కరీంనగర్ ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తానని చెబుతూ వచ్చారు. అవినీతికి, భూకబ్జాలకు తావు లేకుండా కరీంనగర్ ను అన్ని విధాలా అభివ్రుద్ధి చేసి ఆదర్శవంతమైన పాలన అందించే బాధ్యత తీసుకుంటానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
మొత్తంగా బండి సంజయ్ ఎంచుకున్న ఈ మూడు అంశాలు ప్రజల్లోకి విస్త్రతంగా వెళ్లాయి. సంజయ్ ఎక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించినా తండోపతండాలుగా తరలివచ్చారు. మండు టెండలోనూ ఓపికగా సంజయ్ ప్రసంగాలను ఆసక్తితో వింటూ…చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. మరోవైపు సంజయ్ ప్రచార సరళి, ఎన్నికల ఎత్తుగడ దెబ్బకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయాయి. అటు ప్రచార సరళిలో, ఇటు ఎన్నికల ఎత్తుగడలో పూర్తిగా వెనుకబడిపోయారు. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు సైతం ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులైపోవడం గమనార్హం.
ఇక అభ్యర్థుల విషయానికొస్తే… వర్గ పోరుతో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాలు పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఏర్పడింది. ముఖ్య నేతలంతా తమ అనుచరుల గెలుపుకే పరిమితమవుతూ…ఇతర డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులనూ పట్టించుకున్న దాఖలాల్లేవు. అధికారంలో ఉన్నంత కలం పార్టీ ఫిరాయింపులకు పెద్ద పీట వేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఫిరాయింపులే తలనొప్పులుగా నిలిచాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందే ఆ పార్టీ నుండి పలువురు మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలా ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళుతూ… తమకు ఓటేయాలని, గెలిచిన తరువాత తాము కూడా బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతామంటూ ఓటర్లకు చెబుతూ ఓట్లను అభ్యర్ధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక బీజేపీ విషయానికొస్తే… అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకుని ఎన్నికలను ఒంటి చేత్తో నడిపించారు. పార్టీ కండువాలు, టోపీలు, కరపత్రాలుసహా ప్రచార సామాగ్రి మొత్తాన్ని తానే అభ్యర్థులకు పంపించారు. పార్టీ కార్యక్రమాలకు అయ్యే ఖర్చునంతా తానే భరించారు. బీజేపీ పక్షాన పోటీ చేసిన అభ్యర్థుల్లో 90 శాతం మంది పేద, మధ్య తరగతి వారే. రాష్టంలో ఎన్నడూ అధికారంలో లేకపోవడం, పదవుల్లో కూడా లేకపోవడంతో వారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కుటుంబ నిర్వహణే కష్టంగా ఉన్న అభ్యర్థులు కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వారందరికీ ఎన్నికలకు అవసరమైన ఆర్ధిక సాయాన్ని కూడా స్వయంగా బండి సంజయ్ అందించారు. కొంత మంది అభ్యర్థులకు నామినేషన్ పత్రాలకు అవసరమైన డిపాజిట్ సొమ్మును కూడా బండి సంజయ్ పంపించడం గమనార్హం.
ఎన్నికల ప్రచార వ్యవధి తక్కువగా ఉండటంతో పొద్దున్నే 6 గంటలు మొదలు రాత్రి 10 గంటలదాకా వారి గెలుపు కోసం కాలికి బలిపం కట్టుకుని గల్లీ గల్లీలోనూ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్ధించారు. ప్రచార సమయం ముగిసిన తరువాత సైతం పోల్ మేనేజ్ మెంట్, మరుసటి రోజు పార్టీ కార్య్రమాల నిర్వహణపై కసరత్తు చేస్తూ ప్రతి గడప గడపకూ బీజేపీని తీసుకెళ్లడంతోపాటు ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు మున్సిపాలిటీల్లో బీజేపీ గెలుపు తథ్యం అనే వాతావరణం కల్పించడంలోనూ బండి సంజయ్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టు వర్గాలు చెప్పడం గమనార్హం.
ఏ విధమైన బ్యాక్ గ్రౌండ్ లేని, రాజకీయ అనుభవం లేని, పార్టీ జెండా పట్టకుని పనిచేసిన కార్యకర్తలను పార్టీ అభ్యర్థులుగా బరిలో వారి గెలుపు కోసం బండి సంజయ్ పడుతున్న తపన, చెమటోడుస్తున్న తీరును చూసి కరీంనగర్ ప్రజలంతా ‘‘రాజకీయ నాయకులు సాధారణంగా తాము ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే సమయంలో మాత్రమే కార్యకర్తలను వాడుకుని ఎన్నికలయ్యాక పట్టించుకోరు. బండి సంజయ్ మాత్రం తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలందరినీ గుర్తు పెట్టుకుని వారికి ఒకవైపు ఆర్ధిక సహకారం చేస్తూనే, మరోవైపు ఆ కార్యకర్తలను సర్పంచ్, కౌన్సలర్, కార్పొరేటర్ టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా వారి గెలుపు బాధ్యతను సైతం తన భుజానా వేసుకుని రాత్రింబవళ్లు కష్టపడుతున్న తీరు అద్బుతం. కార్యకర్తలపట్ల ఇంతటి ప్రేమ, బాధ్యత కలిగిన లీడర్ ను మేము ఇంతకు ముందెన్నడూ చూడలేదు… ఇక భవిష్యత్తులోనూ చూస్తామనే నమ్మకం లేదు… శభాష్ సంజయ్’’అంటూ వేనోళ్ల చర్చించుకోవడం గమనార్హం.