అక్కడ అవినీతికి నీతి నిజాయితీకి మధ్య యుద్ధం జరుగుతోంది.
ఆ యుద్ధానికి మేధావులు , డాక్టర్లు , న్యాయవాదులు , మెడికల్ రిప్రజెంటేటివ్స్
మద్దతు ప్రకటించారు .
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ రాజన్నకు వీరందరూ బాసటగా నిలిచారు .
కరీంనగర్ లోని మైత్రి హోటల్లో వీరంతా సమావేశమై నీతి నిజాయితీపరుడు , నిగర్వి అయిన డాక్టర్ పంజాల రాజన్నకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు .
ఈ సమావేశంలో డాక్టర్ అరుణ్ కటారి , డాక్టర్ చాట్ల శ్రీధర్ , డాక్టర్ వెంకటేశ్వర్లు , డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ,డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ పోలాడి శ్రీనివాసరావు ,డాక్టర్ ఓం ప్రసాద్ ,డాక్టర్ సాయి, డాక్టర్ రాజకుమార్ , డాక్టర్ శివకుమార్,
ప్రముఖ న్యాయవాదులు రాజశేఖర్, వినయ్, సుధాకర్, భాస్కర్ ,శంకర్, శ్రీనివాస్ పటేల్ , శ్రీకాంత్ తో పాటు పలువురు మెడికల్ రిప్రజెంటేటివ్స్ , మేధావులు దాదాపు 150 మంది పాల్గొన్నారు .
వీరిలో చాలామంది భగత్ నగర్ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం !
వీరంతా 42 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పంజాల రాజన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు .
దీంతో రాజన్న భారీ మెజార్టీతో విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం అవుతుంది .
ఈ సందర్భంగా డాక్టర్ రాజన్న మాట్లాడుతూ మీరంతా నీతి నిజాయితీకి అండగా నిలబడడం చాలా సంతోషకరమన్నారు
తనకు మద్దతు ప్రకటించిన వీరందరికీ రాజన్న పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు .