By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: దేవుళ్లంటే మీకు అంత చులకనా? మేనిఫెస్టో పవిత్ర గ్రంథమని మాట ఇచ్చి రైతులను మోసం చేస్తారా?
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > దేవుళ్లంటే మీకు అంత చులకనా? మేనిఫెస్టో పవిత్ర గ్రంథమని మాట ఇచ్చి రైతులను మోసం చేస్తారా?
NewsTelangana

దేవుళ్లంటే మీకు అంత చులకనా? మేనిఫెస్టో పవిత్ర గ్రంథమని మాట ఇచ్చి రైతులను మోసం చేస్తారా?

Last updated: 2024/04/22
Published April 22, 2024 News Telangana
Share
SHARE
ఎన్నికల హామీలను అమలు చేయకుండా మళ్లీ దేవుడి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తామంటూ డ్రామాలాడతారా?
రైతులు, ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సంగతి తేలుస్తరు…
తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే
ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రూ.2 లక్షల రుణమాఫీ డ్రామాలు
పంట నష్టపోతే పరిహారం నేటికీ అందని దుస్థితి
కాంగ్రెస్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్
వడ్ల కొనుగోలులో పెద్ద ఎత్తున కటింగ్ పెడుతున్నారని వాపోయిన రైతులు
ఎమ్మెస్పీ కంటే రూ.5 వందలు తక్కువగా దళారులకు అమ్మాల్సి వస్తోందని ఆవేదన
మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చిన బండి సంజయ్

‘‘ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ మాదిరిగా తమకు పవిత్ర గ్రంథమని, అందులో పొందుపర్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పారు.. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి మీద ప్రమాణం చేస్తున్నరు… నేనడుగుతున్నా.. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు దేవుళ్లను, భగవద్గీత, బైబిల్, ఖరాన్ లను వాడుకుంటారా? ఎన్నికలైపోంగనే వాటిని గాలికొదిలేస్తారా? దేవుళ్లంటే మీకు అంత చులకనా?’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు..

ఈరోజు ఉదయం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ వడ్ల కొనుగోలు కేందాన్ని సందర్శించారు. వడ్ల కల్లాలను పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఏకరవు పెట్టారు. ‘’సార్.. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నం. అధికారులు ఎంత చెప్పినా వడ్లలో కటింగ్ పెడుతున్నరు. వానొస్తే భయమైతుంది. టార్పాలిన్లు ఇవ్వడం లేదు. కనీస సౌకర్యాల్లేవు. తాలు, తరుగు పేరుతో ఇబ్బంది పెడుతున్నరు. ఇవన్నీ మీలాంటోళ్లకు చెబుదామంటే రైతులను ఇక్కడున్నోళ్లు భయపెడుతున్నారు. దీంతో రైతులెవరూ మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. రైతులే దేశానికి వెన్నుముక అంటరు.. రైతుల వెన్నుపూస ఇరగ్గొడుతున్నరు. రైతుల ఆవేదనను విన్ని బండి సంజయ్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ముఖ్యాంశాలు…

నిన్న మొన్న కురిసిన అకాల వర్షాలవల్ల చాలా ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నరు. వాళ్ల బాధలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాను. వానలతో ఎంతో కొంత వడ్లు తడిస్తే… దానిని పట్టుకుని ఇక్కడికి వచ్చి వడ్లన్నీ తడిశాయంటూ.. పెద్ద ఎత్తున కటింగ్ పెడుతున్నరు. క్వింటాలుకు 10 కిలోల దాకా కోత పెడుతున్నరు.. ప్రభుత్వం పైకి మాత్రం రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటనలు పేపర్లకే పరిమితమవుతున్నయి. కచ్చితంగా వడ్లలో గంప గుత్తగా కటింగ్ పెడుతున్నరు. కనీస మద్దతు కూడా రైతులకు దొరకడం లేదు. 16 నుండి 17 వందలకే వడ్లు కొనే దుస్థితి ఏర్పడింది.

ఎన్నికల మేనిఫెస్టో తమకు బైబిల్, ఖరాన్, భగవద్గీతతో సమానమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని నమ్మించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మళ్లీ మోసం చేస్తున్నరు. నేనడుగుతున్న తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ కళ్ల ముందే మోసం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?

వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో హమీ ఇచ్చారు. వడ్లతోపాటు ఇతర పంటలకు బోనస్ ఇవ్వడానికి రూ. 5వేల కోట్ల నిధులు కావాలి. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లన్నీ కొనాలంటే ప్రభుత్వంపై రూ.700 కోట్ల భారం పడుతుంది. ఈ రెండు హామీల అమలు కోసం రూ.5700 కోట్ల నిధులు అవసరం. వాటినే ఖర్చు చేయకుండా రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు కోసం రూ.30 వేల కోట్లను విడుదల చేస్తామంటే నమ్మేదెవరు? తక్కువ బడ్జెట్ లో ఇచ్చిన హామీలనే అమలే చేయని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15లోపు రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మేదెవరు? అసలు కాంగ్రెస్ పార్టీకి దేవుడి మీద, బైబిల్, భగవద్గీత, ఖురాన్ మీద విశ్వాసం ఉందా? ఉంటే ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వడ్లకు బోనస్ ఇవ్వాలి. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలి. అట్లాగే తడిసిన వడ్లను పూర్తిగా కనీస మద్ధతు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

కాంగ్రెస్ హయాంతో పోలిస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం కనీస మధ్దతు ధరను రెట్టింపు చేశారు. ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరాకు రూ.20 వేల దాకా రైతులపై భారం తగ్గిస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సబ్సిడీలన్నీ ఎత్తేసే ప్రమాదం ఉంది. కనీస మద్దతు ధర చెల్లించే పరిస్థితి కూడా ఉండదు. తద్వారా రైతులపై విపరీతమైన భారం పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతాంగం వాస్తవాలు ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:bandibjpCongressfarmershusnabadmanifestomodinarendrapoliticalfactorysanjaytelanganavisit
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article వడ్లకు బోనస్ రూ.500లు ఇవ్వలేనోళ్లు రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేస్తానంటే నమ్మేదెలా?
Next Article బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరిక
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?