
(పొలిటికల్ ఫ్యాక్టరీ – వికారాబాద్)
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని,సమూలంగా మార్చాలని కుట్ర జరుగుతున్న సమయం లో ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతోంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు .
వికారాబాద్ లో జరుగుతున్న
డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు .
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర్యం కు ముందు
140 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది..
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్ర్యం,ఇచ్చిన రాజ్యాంగం ను ఉపయోగించుకొని పుట్టిన పార్టీ లు ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాయి..
భారత దేశ ఆత్మ గౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని సీఎం అన్నారు.
డీసీసీ అధ్యక్షులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వారసత్వం గా పదవులు పొందే అవకాశం వైఎస్ షర్మిల కు ఉంది..ఐనా ఆమె తీసుకోలేదు
మహాత్మా గాంధీ , జవహర్ లాల్ నెహ్రూ
దేశం కోసం జైలు కు వెళ్లారు..
మహాత్మా గాంధీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళు కనీసం లాఠీ కూడా ఎత్తలేదు..
కానీ స్వాతంత్ర్యం వచ్చాక భారతీయుల పార్టీ కి చెందిన వారి తూటాలకు మహాత్మా గాంధీ నేలకొరిగారు..
గాంధీ,ఇందిరా,రాజీవ్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అని రేవంత్ రెడ్డి అన్నారు .
దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు ఇచ్చారు..
దేశ సమగ్రత కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారు..
రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ సర్వం త్యాగం చేసి కాంగ్రెస్ కు అండగా నిలిచారు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు .
కష్టం తెలియకుండా పదవులు పొందే అవకాశం ఉన్నా ,త్యాగాల చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.,
వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర,ఆయన సంక్షేమ కార్యక్రమాలు,అభివృద్ధి కాంగ్రెస్ విజయాలలో ప్రస్తావించాలి..
వైఎస్ షర్మిల తెలంగాణ లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు..
ఏపీ లో పార్టీ కోసం కష్ట పడుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు .
జిల్లాకు అధిపతుల మని డీసీసీ అధ్యక్షులు భావించవద్దు..
వ్యతిరేకించిన వాళ్ళను అణిచి వేసే ప్రయత్నం చేయొద్దు..
నేను పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి కలిసి మద్దతు అడిగారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు .
కలిసికట్టుగా పనిచేయడం వల్లనే రొండున్నర శాతం ఉన్న కాంగ్రెస్ 40 శాతం ఓట్లు తెచ్చుకొని అధికారం లోకి వచ్చింది అని రేవంత్ రెడ్డి తెలిపారు .
119 నియోజక వర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయించాం..
డీసీసీ అధ్యక్షులు గా బాగా పని చేసిన వారికి ఎంఎల్ ఏ లు గా అవకాశంఇచ్చాం..
పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చాం..
డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యను గమనిస్తూనే ఉంటాం..
కాంగ్రెస్ లో ఏ కోటా లేదు..మెరిట్ కోటా మాత్రమే ఉంటుంది..
డీసీసీ అధ్యక్ష పదవి ని దుర్వినియోగం చేసుకోవద్దు అని ఆయన కోరారు .
పార్టీ విశ్వాసాన్ని దెబ్బ తియ్యవద్దు..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు,ప్రత్యర్ధి పార్టీ కి ఉన్న తేడా 2 శాతం ..అది పార్లమెంట్ ఎన్నికల కు 4 శాతానికి పెరిగింది..మునిసిపల్ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగింది..
పార్టీ కార్యకర్త లు,ప్రజల్లో ఉన్న నమ్మక వల్లనే ఇది జరిగింది…
దేశాన్ని,కాంగ్రెస్ ను విడదీయలేరు..
దేశం ఆత్మ నే కాంగ్రెస్…
కాంగ్రెస్ పైన బీజేపీ కుట్ర చేస్తోంది..
పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ని మాట్లాడనివ్వకుండా బీజేపీ కుట్ర చేస్తోంది..
సోనియా, రాహుల్ పైన కేసు లు పెట్టి అవమానిస్తోంది…
మూడు తారలు ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరమా?
రాజకీయం గా గాంధీ కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవడం కోసం బీజేపీ కుట్ర చేస్తోంది రేవంత్ రెడ్డి ఆరోపించారు .
దళితులు,మైనార్టీ లు,బడుగు బలహీన వర్గాలు,
పేదల గొంతును నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు..
100 ఏళ్ల తర్వాత రాష్ట్రం లో కులగణన చేశాం..
ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం..
సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీ లు సర్పంచ్ లు అయ్యారు..
మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం మంది ఓబీసీ లు ఎన్నికయ్యారు..
ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యం అయింది..
పైరవీలు చేయకపోతే నాయకుల గౌరవం పెరుగుతుంది..
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలి..
నేను ఏ నాడు పైరవీ కోసం పని చేయలేదు..
16 ఏళ్ల లో zptc నుంచి సీఎం వరకు అడిగాను..కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చింది
రెండుగా విడిపోయినా కాంగ్రెస్ పార్టీ రొండు చోట్ల బలపడాలి..
రెండు రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదగాలి..
రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాలి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు .