తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా ఫలితాలు సాధించాలి.
ప్రశాంతంగా పరీక్షలు రాయండి..
ఏలాంటి ఒత్తిడికి లోను కావద్దు..
లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలి..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..
ఇంటర్ విద్యార్థులకు శుభాకాంక్షలు..
కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తున్న గురువులు గర్వపడేలా ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కరీంనగర్ కీర్తిని దశ దిశల చాటాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. మంగళవారం రాజేందర్ రావ్ మీడియాతో మాట్లాడారు. బుధవారం నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు జీవితంలో ఒక దశ మాత్రమేనని, మార్కుల కంటే విద్యార్థుల జ్ఞానం, కృషి, ఆత్మవిశ్వాసమే ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. ప్రశాంతంగా, ధైర్యంగా ప్రతి ప్రశ్నకు మీకు తెలిసినంత ఉత్తమంగా సమాధానం రాయాలని ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కన్న కలలు నిజమవ్వాలని, మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రాజేందర్రావు ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల నుంచి మొదటి సంవత్సరం 18,175 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 18,251 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. జిల్లాలో 57 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు.