భాగ్యనగరంలో ఎలప్పుడూ ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సర్వీసులు దూసుకు పోతుంటాయి. ఈ మధ్య కాలంలో జనాలు ఆర్టీసీ బస్సుల కంటే.. వీటిపైనే ఎక్కువగా మొగ్గుచూపు తున్నారు.
ఇలా యాప్‌లో బుక్ చేస్తే చాలు.. క్షణాల్లో ఆ బైక్ మన ఇంటికొస్తుంది.. సరాసరి మన డెస్టినేషన్ పాయింట్‌కి చాలా సులభంగా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసు కెళ్తుంది. అందుకే నేమో.. ఇటీవల ఈ సంస్థలకు చెందిన బైక్ సర్వీసులు విపరీతంగా పెరిగి పోయాయి.
అయితే తాజాగా ఓ బైక్ రైడర్‌కు వింత అనుభవం ఎదురైంది. కస్టమర్ చేసిన పనికి ఏం చేయాలో తెలి యక.. రోడ్డుపై దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు.
బైక్‌లో పెట్రోల్ అయిపో యినా.. కస్టమర్ దిగక పోవడంతో.. ఏం చేయలేక అలాగే బండిని తోసుకుం టూ వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.