ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer) ప్రసంగంలో విద్య, వైద్యం అంశాల గురించి ప్రస్తావించగానే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chellaboina venugopal krishna) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ… గతంలో రాజకీయ నాయకులమీద నమ్మకం ఉండేది కాదని… ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై నమ్మకం వచ్చిందని తెలిపారు.
అన్నివర్గాల సంక్షేమానికి అనుగుణంగా వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచిచేస్తేనే తనకు ఓటు వేయాలని జగన్ అన్నారంటే.. ప్రజలపై ఆయనకు ఎంత చిత్తశుద్ది ఉందో తెలుస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పేదరికం తగ్గిందని చెప్పారు. కొంత మంది నేతలు ధనదాహానికి అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. పేదవారికి మంచి చేసే వారిని ఓడిస్తానని ఆ నేతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనబడదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు.