ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయంటూ బురిడీ కొట్టించి నగరవాసి నుంచి రూ.21.7లక్షలు కొల్లగొట్టిన ఢిల్లీ సైబర్ కిలేడీని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. సిటీ క్రైమ్స్ అండ్ సిట్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావునగర్(Padmarao Nagar)కు చెందిన బాధితుని ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఇంట్లో కూర్చొని పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ.. రోజుకు రూ. వేలల్లో సంపాదించొచ్చు. ఇంట్రెస్టు ఉన్నవాళ్లు లింక్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ఉంది. అదంతా నిజమని నమ్మిన బాధితుడు లింక్ ఓపెన్ చేశాడు. వెంటనే గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసింది. తాను టెనెక్స్ ఇన్వెస్టిమెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రొపరేటర్గా పరిచయం చేసుకుంది. ట్రేడింగ్‌లో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే అతితక్కువ సమయంలోనే ఊహించిని విధంగా ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని నమ్మబలికింది. ముందుగా తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి లాభాలు వచ్చేలా చేసిన అనంతరం రూ. 21.7లక్షలు పెట్టుబడులు పెట్టించింది. అనంరతం స్పందించడం మానేసింది.
రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్..
బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాయింట్ సీపీ రంగనాథ్ ఆదేశాలతో డీసీపీ ధార కవిత, ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నరేష్ టీమ్ రంగంలోకి దిగింది. టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించి నిందితురాలిగా ఢిల్లీకి చెందిన సైబర్ కిలేడీ శృతి మయూర్ బఫ్నాగా గుర్తించారు.
సైబర్ నేరగాళ్లకూ సహకారం..
ఇన్వెస్టిమెంట్స్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి రూ. లక్షల్లో కొల్లగొట్టడమే కాకుండా.. తనకు క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్ వెసులుబాటు ఉండటంతో సైబర్ నేరగాళ్లకూ సహకారం అందిస్తోంది. ఒక్కో బ్యాంకు ఖాతాను రూ.1లక్ష చొప్పున రెండు బ్యాంకు ఖాతాలను కొనుగోలు చేసింది. తాను చేసే లావాదేవీలన్నీ వాటి నుంచే చేసేది. ఏదైనా తేడా వస్తే ఆ బ్యాంకు ఖాతా తనది కాకపోవడంతో పోలీసులకు దొరకనని ధీమా. తనకు క్రిప్టో మార్కెటింగ్ ట్రేడింగ్ ఉండటంతో చాలా మంది సైబర్ నేరగాళ్లు ఆమె బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసి వాటిని క్రిప్టోగా మార్చి పంపేవారు. ఇందుకుగాను 10 నుంచి 15 శాతం కమీషన్ ఇచ్చేవారు. అలా ఆమె కొనుగోలు చేసిన రెండు బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 3కోట్లు డబ్బు క్రిప్టోగా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీకి వెళ్లిన సిటీ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.