ముంబై, ప్రతినిధి : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు షాక్ ఇచ్చారు తమిళ పార్టీ నేతలు. సల్మాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మధ్యే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను సపోర్ట్ చేస్తూ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఆయనతో పాటు హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఎలక్షన్ క్యాంపైన్ లో పార్టిసిపేట్ చేసింది. ఇది తమిళ పార్టీ నేతలకు కోపం తెప్పించింది. దీంతో ముంబాయిలోని సల్మాన్ ఇంటి ముందు ఆందోళనలు చేశారు.

తమిళులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆయనకు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు తమిళ పార్టీల నేతలు. ఎల్టీటీఈ జెండాలతో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజపక్సే కొడుకు నమల్ కోరిక మేరకు శ్రీలంక ప్రెసిడెంట్ పదవి కోసం జరిగే ఎన్నికల ప్రచారంలో సల్లు భాయ్ ప్రచారం చేశారు.
సల్మాన్ ఇంటి ఎదుట తమిళ నేతల ఆందోళన
Leave a comment