కొలోంబో, ప్రతినిధి : శ్రీలంకలో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న మైత్రిపాల సిరిసేన భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. దీంతో, ఇప్పటివరకు ప్రెసిడెంట్ గా ఉన్న మహిందా రాజపక్సే ఓటమిని అంగీకరించారు. అంతేకాకుండా, తన అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. ఈరోజు సాయంత్రం ప్రెసిడెంట్ గా సిరిసేన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.