న్యూఢిల్లీ , ప్రతినిధి : భారత దేశాన్ని నెంబర్ వన్ గా నిలవాలంటే ‘మేక్ ఇన్ ఇండియా’ వల్లే సాధ్యమని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు దంచి కొడుతున్నారు. పరాయి గడ్డపై నిలుచని ఇండియాను అభివృద్ధి బాటలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోడీ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి..కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కానీ దానికంటే ముందు మన వ్యవసాయ రంగాన్ని వృద్ధి పరిచి గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం చాలా అవసరమని ఆర్థిక రంగ నిపుణులు సూచనలు చేస్తున్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ దీనిపై పెదవి విరిచారు.
పెదవి విరిచిన ఆర్బీఐ గవర్నర్..
ఫిక్కీ ఏర్పాటు చేసిన భరత్ రామ్ మెమోరియల్ లెక్చర్‌కు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ‘మేక్ ఇన్ ఇండియా’ కాదు ‘మేక్ ఫర్ ఇండియా’ అంటూ పిలుపు నిచ్చారు. దేశీయ ఉత్పాదక రంగానికి ఊతమివ్వాలంటే భారత్‌లో కాదు భారత్ కోసం తయారు చేయాలని ఆర్ బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. భారత్ పటిష్ఠమైన ఆర్ధిక వ్యవస్ధగా ఎదగాలంటే దేశీయ విపణి పైనే అధికంగా ఆధార పడాలని, చైనాతో పోలిక పెట్టుకోవటం సరికాదని హితవు పలికారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పన్ను విధానాల్లో పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కేంద్ర మంత్రులు ఎలా స్పందిస్తారో ?
ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి ప్రతిపక్షాలతో సహా ఇప్పటివరకు కౌంటర్ ఇచ్చిన వారు లేరు. మేక్ ఇన్ ఇండియా కాదు మేక్ ఫర్ ఇండియా అంటూ ఏకంగా రిజర్వు బ్యాంక్ గవర్నర్ పిలుపునిచ్చేసరికి కేంద్రం పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రివర్స్ కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి కేంద్రమంత్రులు రఘురామరాజన్ వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది.
మోడీ ఫార్ములానే తప్పంట..
Leave a comment