కరీంనగర్, ప్రతినిధి : భారత దేశం గర్వించదగ్గ వ్యక్తి మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) అని పలువురు వ్యక్తలు కొనియాడారు. ఆదివారం నాడు కరీంనగర్ ఇందిరాగార్డెన్ లో డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన స్వర్గీయ వెంకటస్వామి సంస్మరణ సభను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమకుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సంస్మరణ సభలో వ్యక్తలు మాట్లాడుతూ.. దేశం సీనియర్ కాంగ్రెస్ నేత అయిన వెంకటస్వామి సేవలను కోల్పోయిందన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిషలు పోరాడిన గొప్ప వ్యక్తి కాకా అని ప్రశంసించారు. కార్మిక మంత్రిగా కార్మికులకు ఎంతో సేవ చేశారని.. ఆయన చేసిన సేవయే ఇప్పడు కాకాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసేలా చేసిందని కొనియాడారు. హైదరాబాద్ లో ఎంతో మంది గుడెసెలు ఉన్న పేదలకు స్థలాలిచ్చి వారి ఆశాదీపంలా మారిన కాకాను ఎవరు మరువలేరన్నారు. గోదావరిఖనికి ఎరువుల కార్మాగారం ఇప్పించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన చరిత్ర కాకా ది అన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ కు పెద్దలోటు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, వెంకటస్వామి కుమారులు మాజీ వివేక్, మాజీ మంత్రి వినోద్, మాజీ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ శాసనసభ్యులు వేములవాడ ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మా వెంకటేశ్వర్లు, అడ్లూరి లక్ష్మన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి, నేరెళ్ల శారద, ఆకుల ప్రకాష్, కర్ర రాజశేఖర్, తాటిపత్రి శోభారాణి, బొమ్మా కళ్యాన్ చక్రవర్తి, గుగ్గిళ్ల జయశ్రీ, ఆమ ఆనంద్, మామిడిపెల్లి పాపయ్య, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పంజాల శంకరయ్య గౌడ్, భూస అంజయ్య, అర్ష మల్లేషం, బాకరపు శివయ్య, పెగడపల్లి మోహన్ రెడ్డి, గర్వందల మల్లేషం, గందె మహేశ్,తో పాటు అధికసంఖ్యలో కాకా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.