హైదరాబాద్: బిజెపి అధినేత అమిత్ షా తెలంగాణ పదాదికారుల సమావేశంలో ఆవేశంతో చిందులు తొక్కినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆఫీస్ బేరర్స్ తో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు నత్తనడకన సాగటంపై చీవాట్లు పెటినట్లు సమాచారం. ఇలాగైతే టార్గెట్ ను ఎలా చేరుకుంటామని అమిత్ షా నేతలను నిలదీసినట్లు తెలుస్తోంది. 10 కోట్ల సభ్యత్వ నమోదు టార్గెట్ గా నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు ఆశించిన విధంగా లేదని మండి పడినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేయకపోవడంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అంతే పార్టీ నేతల తీరుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.